Diabetes Fruits: మధుమేహం ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకరమైన వ్యాధి. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి నియంత్రణ కూడా లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతోనే సాధ్యమౌతుంది. నియంత్రణ ఎంత సులభమో..నిర్లక్ష్యం అంత ప్రమాదకరం.
Diabetes Fruits: డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏది తినవచ్చు ఏది తినకూడదనే డైట్ ఛార్ట్ సిద్ధం చేసుకోవాలి. అయితే ఫ్రూట్స్ విషయంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎప్పుడూ సందేహాలుంటాయి. ఇక్కడ ఉదహరిస్తున్న కొన్ని ఫ్రూట్స్ మధుమేహం వ్యాధిగ్రస్థులు ఏ విధమైన భయం లేకుండా తినవచ్చు. అంతేకాదు ఈ పండ్లతో మధుమేహం నియంత్రణ కూడా సాధ్యమౌతుంది.
పీచ్ ఫ్రూట్స్ పీచ్ ఫ్రూట్స్ అందరికీ ప్రయోజనకరమైంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది.
బొప్పాయి మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ బొప్పాయి పండు తింటే రక్తంలో చక్కెర శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది. ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫ్రూట్. ఎవరైనా సరే తినవచ్చు.
నేరేడు పండ్లు నేరేడు పండ్లు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఓ వరంగా పనిచేస్తాయి. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ నేరేడు పండ్లు తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పూర్తిగా నియంత్రణలో వచ్చేస్తాయి.
జామ దక్షిణ భారతదేశంలో విరివిగా లభించే జామ ఆరోగ్యపరంగా చాలా అద్భుతమై పోషకాలు కలిగి ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఫలితంగా బ్లడ్ షుగల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఆపిల్ ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. ముమ్మాటికీ నిజం. రోజుకు ఒక ఆపిల్ తింటే ఏ విధమైన అనారోగ్య సమస్య దరిచేరదు సరికదా మధుమేహం చాలా సులభంగా నియంత్రణలో ఉంటుంది.