Health benefits of Ginger: అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో (Ginger recipes) కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.
ఉదయం లేవగానే తరచుగా వికారంగా అనిపిస్తుందా? ప్రతీ రోజు అల్లం తినడం ద్వారా ఆ వికారాన్ని నివారించవచ్చు. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెల్లం, లేదా చక్కరతో చేసిన అల్లమురబ్బ (Allamurabba) తినడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. లేదంటే సన్నగా, చిన్నగా తరిగిన అల్లం ముక్కలను తేనేలో కలుపుకొని కూడా తినవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు (Pregnants), కీమోథెరపీ చేయించుకునేవారు దీని నుండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు అల్లం ప్రాముఖ్యత తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్.
గొంతు నొప్పితో బాధపడే వారికి అల్లం ఛాయ (Ginger tea) దివ్య ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లంతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of ginger) ఉన్నాయి కనుకే దీనిని వంటింటి ఔషదంగా చెబుతుంటారు.
ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పితో బాధపడేవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి (Muscle pains) క్రమంగా తగ్గుతుంది.
మలబద్దకం సమస్యతో (Constipation) బాధపడే వారికి అల్లం మంచి దివ్య ఔషధంగా పని చేస్తుంది. అల్లంలో ఉండే పీచు మలబద్దకాన్ని దూరంచేస్తుంది.
అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని (Pains during periods) అరికట్టవచ్చు. అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) తగ్గుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. Also read : Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్ Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి మధ్య తేడాలు Also read : COVID-19 vaccine తీసుకుంటే పిల్లలు పుట్టరా ?
అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల రోగనిరోధక శక్తి (Immunity boosters) బలపడటంతో పాటు శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు. అందుకే జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది. Also read : Green Tea: గ్రీన్ టీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎలా పనిచేస్తుందో తెలుసా Also read : Cucumber Benefits: సమ్మర్లో కీరదోస తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం Also read : Lemon Water: నిమ్మరసం అధికంగా తాగుతున్నారా, ఈ Side Effects తెలుసుకోండి