Schools Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు

Holiday Declared For Schools and Colleges: ఫెంగల్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 

1 /6

తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

2 /6

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.   

3 /6

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

4 /6

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ సెలవు ప్రకటించాలని పేరెంట్స్, విద్యార్థులు కోరుతున్నారు. అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

5 /6

మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

6 /6

ఫెంగల్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.