Tomato: వర్షాకాలంలో టమాట ధరలు మరింత పెరిగేలోపు ఈ ఒక్క పని చేయండి.. రేటు పెరిగినా కంగారు పడాల్సిన పనిలేదు..

How to Store Tomatoes: వర్షాకాలం మరిన్ని కారణాల వల్ల టమాటాల రేట్లు మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా టమాటాలు ఉల్లిగడ్డలు లేనిదే ఏ వంట చేసుకోలేం. సెంచరీలు కొడుతున్న ఈ కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలను ఇలా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు వినియోగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

టమాటాలు మనం నిత్యం ఇంట్లో వినియోగించే కూరగాయ. అందుకే ఏ కూరగాయలు ఇంట్లో అందుబాటులో లేకున్నా సామాన్యులు టమాటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు. కూర రెడీ అయిపోతుంది. పెరుగుతున్న టమాటాలు గుండెల్లో గుబులు పెడుతున్నాయి.   

2 /5

టమాటాలు ఇంకా రేటు పెరగక ముందే కొనుగోలు చేసి రకరకాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. మార్కెట్లో రేటు పెరిగినా ఫర్వాలేదు. టమాటాలు కట్‌ చేసి ఎయిర్‌ ఫ్రైయర్‌లో ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు.   

3 /5

టమాటాలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి మరో విధానం వాటిని కట్‌ చేసి జిప్‌ లాక్‌ బ్యాగుల్లో స్టోర్‌ చేయాలి. దీనికి జిప్‌ లాక్‌ బ్యాగులు అవసరం ఉంటుంది. టమాటాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడవాలి. ఆ తర్వాత జిప్‌ లాక్‌ బ్యాగులో వేసి గాలి లేకుండా లాక్‌ చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి.  

4 /5

టమాటాలు నిల్వ చేయడానికి మరో విధానం వాటిని కట్‌ చేసి నూనెలో వేయించుకోవాలి. పూర్తిగా నీరు లేకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఓ గాజు సీసాలో వేసి ఫ్రీజ్‌లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు.  

5 /5

టమాటాలకు బదులుగా కొన్ని ఇతర ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని కూడా కూరల్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా పెరుగు కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఇది వేసినా టమాట రుచి వస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )