Indiramma Housing: సొంతింటి కల నెరవేరే సమయం.. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లు ఖాతాల్లోకి రూ.5,00,000..

Indiramma Housing Scheme: ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తోంది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సొంతింటి కల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పనుంది.
 

1 /6

నిన్న డిసెంబర్‌ 5వ తేదీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్‌ను కూడా ప్రారంభించారు. బుధవారం మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు.  

2 /6

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ దీనికి సంబంధించిన డబ్బులు జమాపై మంత్రి బిగ్‌ అప్డేట్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 6వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని ప్రకటించారు.  

3 /6

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని పేదలకు ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చేందకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని నిన్న సీఎం రేవంత్‌ చెప్పారు.  

4 /6

ఈ ప్రక్రియను అవినీతికి తావులేకుండా, శరవేగంగా అమలు చేసేందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.  

5 /6

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మంజూరు చేసే రూ.5,00,000 నాలుగు దశల్లో మంజూరు చేయనున్నారు. మొదట స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టిస్తారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బు జమా అవుతుంది.  

6 /6

ఈ పథకంలో మొదటగా మహిళలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పేదల కలల సాకారం చేసే ఈ పథకంలో ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.