Pushpa 2 Vs Interstellar: పుష్ప2 మూవీ వల్ల హలీవుడ్ మూవీ ఇంటర్ స్టెల్లార్ మూవీ వాయిదా వేయాల్సి వచ్చిందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. దీనిపై జాన్వీకపూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.
పుష్ప2 సినిమా ఇటీవల డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు అనేక రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప2 మూవీ.. విడుదల తర్వాత మరల అదే రికార్డుల మోతను కంటీన్యూ చేస్తుంది.
ఈ క్రమంలో ఈ మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్లకు పొటెత్తుతున్నారు. అల్లు అర్జున్ సినిమా పుష్ప2 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.
ఎక్కడ చూసిన అందురు పుష్ప2 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేవర భామ జాన్వీకపూర్ పుష్ప2 కు అండగా నిలిచినట్లు తెలుస్తొంది. పుష్ప2 సినిమా ఇటీవల రిలీజ్ అయి.. ప్రతి చోట ఐమాక్స్ లో ఈ షో నడుస్తున్న విషయం తెలిసిందే.
అయితే... ఉత్తరాదిన హలీవుడ్ సినిమా అయిన.. ఇంటర్ స్టెల్లార్ మూవీ రీరిలీజ్ చేయాలని భావించారంట. కానీ.. ఐమాక్స్ లన్ని పుష్ప2 తో బిజీగా ఉండటంతో వాయిదా వేసుకున్నారంట. ఈ మూవీ.. 2014 లో విడుదలైంది. పదేళ్లయిన నేపథ్యంలో దీన్ని మరల రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారంట. ఈ మూవీకి.. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు.
అయితే.. కొంత మంది పెట్టిన ఈ పోస్టులపై నటి జాన్వీకపూర్ స్పందించారు. ఒక సినిమాను మరోక సినిమాతో ఇలా కంపెరీజన్ ఎందుకంటే ఫైర్ అయ్యారు. మన దేశాన్ని ఎందుకు తక్కువ చేస్తూ అవమానిస్తున్నారు అంటూ మండిపడినట్లు తెలుస్తొంది.
మీరు ఏ హాలీవుడ్ సినిమాల కోసం మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారే.. పుష్ప2, మన సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని చురకలు పెట్టారు. ఇలా మన సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడటం బాధగా ఉందన్నారు. ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని హితవు పలికారు.