Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Kalki 2898 AD Hindi Box Office Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా  తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్  భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంతో  ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ విషయానికొస్తే..

1 /6

Kalki 2898 AD Hindi Box Office Collections:రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కథ  పడితే.. ఎలా ఉంటుందో రీసెంట్ గా ‘కల్కి 2898 AD’మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. అంతేకాదు మన దేశంలో  బుక్ మై షోలో ఈ సినిమా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.

2 /6

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్  రెండింటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

3 /6

మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో మాత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

4 /6

ఇప్పటికే హిందీలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి  రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్  బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 86 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మొత్తంగా 149.85 కోట్ల షేర్ (రూ. 300 కోట్ల గ్రాస్) రాబట్టింది.

5 /6

మొత్తంగా హిందీలో థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 64.85 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. ‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు రూ. 1182 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది.

6 /6

మొత్తంగా మీద అన్ సీజన్ లో విడుదలైన ‘కల్కి’ మూవీ  ఆకట్టుకునే కథ, కథనం ఉంటే.. ఏ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో కుమ్మేయచ్చని కల్కి మూవీ మరోసారి ప్రూవ్  చేసింది.