Kalki 2898 AD OTT Records: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఆ రికార్డులను బద్ధలు కొడుతుందా..!

Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

1 /7

Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే.. ఎలా ఉంటుందో రీసెంట్ గా ‘కల్కి 2898 AD’మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే బుక్ మై షోలో ఈ సినిమా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.

2 /7

తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్  రెండింటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

3 /7

మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో మాత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ యేడాది ఎక్కువ మంది చూసిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది.

4 /7

ఇప్పటికే థియేట్రికల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఇప్పటికే థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు ఓటీటీలో  ఏ మేరకు ఆదిరిస్తారనేది చూడాలి.

5 /7

ఒక్కోసారి థియేట్రికల్ గా హిట్టైన చిత్రాలు.. ఓటీటీల్లో అంతగా ప్రభావం చూపించడం లేదు. మరి ప్రభాస్ తాజా మూవీ ‘కల్కి’ మూవీ ఓటీటీలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఈ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టరా కాదా అనేది తేలిపోతుంది.

6 /7

మరి ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఓటీటీలో కూడా సత్తా చాటి నెంబర్ వన్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు రూ. 1182 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది.

7 /7

మొత్తంగా మీద అన్ సీజన్ లో విడుదలైన ‘కల్కి’ మూవీ కంటెంట్ ఉంటే.. ఏ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో కుమ్మేయచ్చని కల్కి మూవీ మరోసారి ప్రూవ్  చేసింది.