Gold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు శుక్రవారంతో పోల్చితే శనివారం స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు. అయితే బంగారం ధర ఇప్పటీ కూడా ఆల్ టైంతో పోల్చి చేస్తూ ఇంకా 6వేలు తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈనెల ఆల్ టైం గరిష్ట 84వేల రూపాయల వరకు పలికింది. అక్కడి నుంచి పసిడి ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. శుక్రవారంతో పోల్చితే పసిడి ధర రూ. 300 పెరిగింది. నేడు 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78960 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 దగ్గర ఉంది.
బంగారం ధరలు నవంబర్ నెలలో గరిష్ట స్థాయి నుంచి చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. ట్రంప్ విజయాన్ని స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా స్పందించడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి నెమ్మదిగా స్టాక్ మార్కెట్ వైపు తరలించాయి.
పసిడి ధరలు ప్రస్తుతం డాలర్ బలపడటం వల్ల భారీగా తగ్గుతున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి డాలర్ 84 రూపాయలకు పెరగడం కూడా ఒక రకంగా కారణమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా మరో కారణం కూడా ఉంది. దేశీయంగా పెద్దగా డిమాండ్ కూడా లేకపోవడమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. అలాగే పండగల సీజన్ కూడా ముగిసింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు తగ్గారు. దీంతో బంగారానికి డిమాండ్ కూడా తగ్గింది.
బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టువారు ధర తక్కువగా ఉన్నప్పుడు ఆభరణాలు కొనుగోలు చేస్తే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.