Kriti Sanon: తెలుగులో కృతి స‌న‌న్‌ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. పేరుకు హిందీ భామ అయిన కృతి స‌న‌న్.. తెలుగులో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన నేనొక్కడినే మూవీతో ప‌రిచ‌య‌మైంది. ఈమెకు తెలుగులో ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

1 /6

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. పేరుకు హిందీ భామ అయిన కృతి స‌న‌న్.. తెలుగులో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన నేనొక్కడినే మూవీతో ప‌రిచ‌య‌మైంది.

2 /6

కృతి స‌న‌న్ ప్ర‌స్తుతం బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా స‌త్తా చూపెడుతోంది. 2021 యేడాది గాను ఈమె ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు అందుకుంది.  

3 /6

గతేడాది ప్ర‌భాస్ ప్ర‌భు శ్రీ‌రాముడిగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో జాన‌కి పాత్ర‌లో ఒదిగిపోయింది.

4 /6

గ‌తేడాది ముంబైలోని బాంద్రాలో రూ. 35 కోట్లు వెచ్చించి 4 BHK అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.

5 /6

దిల్లీలో పుట్టి పెరిగిన కృతి స‌న‌న్.. తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న నేనొక్క‌డినే, నాగ చైత‌న్యకు జోడిగా దోచెయ్ మూవీలో ప‌ల‌క‌రించింది. అటు తెలుగులో ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఆదిపురుష్ మూవీల‌తో ప‌ల‌క‌రించింది. తెలుగు హీరోల‌తో చేసిన సినిమాలేవి కృతి స‌న‌న్‌కు క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పాలి.

6 /6

త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ సినిమాతో తెలుగులో బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తుందా లేదా అనేది చూడాలి.