Ratan TATA: రతన్‌ టాటా ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఎలా ఉందో చూశారా?

Ratan Tata House Tour: పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మృతితో భారతదేశం కన్నీరు పెడుతోంది. ఆయన మృతితో టాటాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం చర్చనీయాంశంగా మారింది. రతన్‌ టాటా నివసించిన ఇల్లుపై అందరి దృష్టి పడింది. అతడి ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం.

1 /7

టాటా కంపెనీ యజమాని రతన్ టాటా సాదాసీదా జీవితం పొందుతుంటారు. ఆయన పుట్టుక.. చావు మొత్తం ముంబైలోనే జరిగింది. సముద్రం తీరంలో రతన్‌ టాటాకు ఇల్లు ఉంటుంది. మొత్తం 3 అంతస్తుల్లో ఇల్లు కలిగి ఉంటుంది.

2 /7

ఈ మూడు అంతస్తులను ఏడు స్థాయిలుగా విభజించారు. ప్రతి అంతస్తు 2 భాగాలుగా విభజించబడింది. 

3 /7

మొదటి అంతస్తు మొత్తం పెద్ద సన్ డెక్ ఉంది. ఇందులో లివింగ్ ఏరియా, రెండు బెడ్ రూములు, స్టడీ రూమ్ ఉన్నాయి. సన్ డెక్‌లో బార్ 50-60 మంది సీటింగ్ సామర్థ్యంతో ఉంది.

4 /7

రెండో అంతస్తులో మూడు పడక గదులు, ఒక గది, గ్రంథాలయం ఉన్నాయి. ఖాళీ సమయాల్లో టాటా పుస్తకాలతో బిజీగా ఉంటారు.

5 /7

మూడో అంతస్తులో అత్యాధునిక మీడియా గది, వ్యాయామశాల, పడక గది ఉన్నాయి. ఇదే అంతస్తులో స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి గది, సన్ డెక్ ఉన్నాయి.

6 /7

రతన్‌ టాటాకు దైవ భక్తి కూడా ఎక్కువే. అందుకే ఈ ఇంట్లో అందమైన దేవుడి ఇల్లు కూడా ఉంది.

7 /7

ఈ భవనంలోని గ్రౌండ్‌ లెవల్‌లో పని మనుషుల వసతి, 10-12 కార్లు పార్కింగ్ స్థలం ఉన్నాయి.