Lok Sabha 2024 Elections Results 2024: బాలయ్య, పవన్ సహా 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సినీ తారలు..


 Lok Sabha 2024 Elections Results 2024:  దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గినా.. ఎన్టీయే కూటమికి మాత్రం మ్యాజిక్ మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో బాలయ్య, పవన్  కళ్యాణ్ సహా  పలువురు సినీ తారలు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా  విజయ కేతనం ఎగరేసారు. 

1 /11

 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య, పవన్  కళ్యాణ్ సహా  పలువురు సినీ తారలు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా  విజయ కేతనం ఎగరేసారు.    

2 /11

శతృఘన్ సిన్హా.. బాలీవుడ్ ఒకప్పటి సూపర్ స్టార్ శతృఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ స్థానం నుంచి టీఎంసీ తరుపున రెండోసారి ఎంపీగా గెలిచారు.

3 /11

నందమూరి బాలకృష్ణ (NBK) నందమూరి బాలకృష్ణ ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని  హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హాట్రిక్ నమోదు చేసారు.

4 /11

పవన్ కళ్యాణ్ (PSPK) జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సారి 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది జనసేన పార్టీ. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

5 /11

కంగనా రనౌత్ (Kangana Ranaut) బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్.. తొలిసారి హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి 71 వేల మెజారిటీతో ఎంపీగా గెలిచింది.

6 /11

హేమా మాలిని (Hema Malini) ఒకప్పటి యూత్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని ముచ్చటగా మూడోసారి ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున ఎంపీగా 2,41,500 మెజారిటీతో  గెలిచింది.

7 /11

సురేష్ గోపీ .. (Suresh Gopi) మలయాళం సీనియర్ స్టార్ హీరో సురేష్ గోపీ.. భారతీయ జనతా పార్టీ  తరుపున త్రిశూర్ నుంచి ఎంపీగా రెండోసారి పోటీ చేసి కేరళలో ఖాతా బీజేపీ ఖాతా ఓపెన్ చేశాడు. ఈయన 75,079 ఓట్ల మెజారిటీతో లోక్ సభలో అడుగుపెట్టబోతున్నాడు. 

8 /11

అరుణ్ గోవిల్.. (Arun Govil) టెలివిజన్ తెరపై తొలి బ్లాక్ బస్టర్ సీరియల్ రామాయణం సీరియల్‌లో  రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.

9 /11

రవికిషన్ శుక్లా ( Ravi Kishan Shukla) భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ రవికిషన్ శుక్లా.. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖ్ పూర్ పార్లమెంట్ సీటు నుంచి 74,536 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.

10 /11

రచనా బెనర్జీ (Rachana Benerjee) తెలుగులో పలు సినిమాల్లో  నటించిన రజనా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నుంచి తృణముల కాంగ్రెస్  ఎంపీగా గెలిచారు.

11 /11

మనోజ్ తివారి (Manoj Tiwari) భోజ్‌పురి టాప్ స్టార్ మనోజ్ తివారి టూ సార్లు ఢిల్లీ నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి కూడా ఈయన అదే స్థానం నుంచి ఎంపీగా హాట్రిక్ విజయం సాధించారు.