India First Train: దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి నడిచింది, ఇప్పుడా ట్రైన్ ఉందా లేదా

భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రోజూకు దాదాపుగా 4 కోట్లుమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణించిందో మీకు తెలుసా...ఇప్పటికీ ఆ రైలు నడుస్తోందంటే ఆశ్చర్యంగా ఉందా

India First Train: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రోజూకు దాదాపుగా 4 కోట్లుమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణించిందో మీకు తెలుసా...ఇప్పటికీ ఆ రైలు నడుస్తోందంటే ఆశ్చర్యంగా ఉందా

1 /8

ఇండియాలో నడిచిన మొట్టమొదటి రైలు పేరు దెక్కన్ క్వీన్. ఇందులో 14 కోచెస్ ఉన్నాయి. ఈ రైలు స్టీమ్ ఇంజన్ తో నడిచింది. 1853 ఏప్రిల్ 16వతేదీ మద్యాహ్నం 3.30 గంటలు బోరీబందర్ నుంచి ప్రారంభమై 4.45 గంటలకు ఠాణే చేరుకుంది.

2 /8

ఇండియాలో మొదటిసారిగా రైలు ఆంగ్లేయుల కాలంలోనే నడిచింది. ఈ రైలు 1853వ సంవత్సరం ఏప్రిల్ 16న ముంబైలోని బోరీబందర్ నుంచి ఠాణే వరకూ నడిచింది. ఈ రోజునే ఇండియన్ రైల్వే డేగా జరుపుకుంటారు

3 /8

భారతదేశంలో నడిచిన మొట్టమొదటి రైలులో 400 మంది ప్రయాణించారు. ఈ సందర్భంగా 34 కిలోమీటర్ల మేర ఉన్న ట్రాక్ ఇరువైపులా రైలును చూసేందుకు భారీగా జనం బారులు తీరారు. 21 సార్లు ఫైరింగ్ జరిపి రైలు ప్రారంభించారు

4 /8

ఈ మొదటి రైలును లాగేందుకు అప్పట్లో మూడు ఇంజన్లు వినియోగించారు. ఈ ఇంజన్లను అప్పట్లో ఆంగ్లేయులు ఓడల ద్వారా బ్రిటన్ నుంచి రప్పించారు. ఈ ఇంజన్లకు సుల్తాన్, సాహెబ్, సింధ్ అని పేర్లు పెట్టారు

5 /8

ఇండియాలోని మొట్టమొదటి రైలు దెక్కన్ క్వీన్ ఇప్పుడు ఎక్స్ ప్రెస్ గా మారి ఇంకా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ రైలు ముంబై-పూణే మధ్య నడుస్తోంది. మహారాష్ట్రంలో అత్యంత ఆదరణ పొందిన రైలు ఇది. 

6 /8

ఇప్పటి ముంబై అప్పట్లో బోంబేగా ఉండేది. 1843లో బ్రిటీషు కాలంలో అప్పటి ఛీప్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ముంబై, కళ్యాణ్, ధాణే ప్రాంతాల్ని కలపాలనే ఆలోచన చేశారు. అందులో భాగంగా పని ప్రారంభమైంది

7 /8

ఆంగ్లేయులు ఇండియాలో రైల్వేను తమ సొంత అవసరాల కోసం అబివృద్ధి చేశారు. ముంబైలోని అతి పెద్ద పోర్టుకు కనెక్టివిటీగా ఈ తొలి రైల్వే లైన్ ఉండేది

8 /8

ముంబై-ధాణే మధ్య మొదటి పాసెంజర్ ట్రైన్ నిర్మాణం, నిర్వహణ చేపట్టింది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ. ఇది బ్రిటీషుకు చెందిన ప్రైవేట్ కంపెనీ. రెండో కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ