Nabha Natesh: సాంప్రదాయ చీరకట్టులో పండగ కళతో ఉట్టి పడుతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులకు ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే  ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్‌గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత తాజాగా 'స్వయంభూ' సినిమాలో యాక్ట్ చేస్తోంది ఈ బామ.  ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం స్వయంభూ నుంచి కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె ఉగాది సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో  కనిపించి కనువిందు చేసింది.

1 /5

నభా నటేష్ .. ఆకర్షించే అందం మరియు యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెట్టింది.

2 /5

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది.  

3 /5

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ అక్కడ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయికగా పరిచయమైంది.

4 /5

తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది.

5 /5

బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్  తాజాగా నిఖిల్ 'స్వయంభూ' మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది నభా. అంతేకాదు ఉగాది సందర్భంగా పండగ కళ మొత్తం తనలో ఉట్టిపడేలా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి వావ్ అనిపించింది.