Naga Chaitanya Sobitha Wedding Invitataion: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల శుభలేఖ.. వేదిక ఎక్కడంటే..

Naga Chaitanya Sobitha Wedding Invitataion: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. తన సహచర నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆగష్టులో గ్రాండ్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4న జరగబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1 /7

Naga Chaitanya Sobitha Wedding Invitataion: నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అంతేకాదు ఎవరి లైఫ్ ను వారు హ్యాపీ లీడ్ చేస్తున్నారు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు.

2 /7

మరోవైపు నాగ చైతన్య తన సహచర నటి శోభితా ధూళిపాళ్లతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెద్దల సమక్షంలో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు.

3 /7

తాజాగా వీరిద్దిరి పెళ్లికి ముహూర్తం కుదరింది. డిసెంబర్ 4న రాత్రి 8.13 నిమిషాలకు జరగనుంది. తెలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరం.. మార్గశిర మాసం శుద్ద పంచమి..ఉత్తరాషాఢ నక్షత్రం మిథున లగ్నంలో జరగబోతుంది.   దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

4 /7

తాత నాన్నమ్మలైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆశీర్వాదంతో పాటు.. మరో తాత, అమ్మమ్మ రామానాయుడు, రాజేశ్వరి ఆశీస్సులతో పెళ్లి జరుగుతున్నట్టు పెళ్లి కార్డులో వేశారు.

5 /7

మరోవైపు కార్డులో చివరలో తన తల్లి లక్ష్మీ..ఆమె భర్త శరత్ పేరుతో పాటు.. నాన్న నాగార్జున, అమల పేర్లు ఆహ్వానిస్తున్నట్టు ఈ పెళ్లి కార్డులో ఉండటం విశేషం.

6 /7

సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభితతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు.

7 /7

పెళ్లి తర్వాత కూడా శోభితా హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తుందా.. లేకపోతే.. ఇంటికే పరిమితం అవుతుందా అనేది చూడాలి. మొత్తంగా డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితాలు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.