Wedding: చాలా మందికి ఈ మధ్య కాలంలో వివాహలు జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కన్పిస్తుంది. ప్యాకేజీ లేదని, ఏజ్ గ్యాప్ ఎక్కువని అమ్మాయిలు, సంబంధాలను రిజక్ట్ చేస్తున్నారు.
చాలా మంది జాతకంలో ఈ మధ్య కాలంలో కాలసర్పదోషాలు సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో సరైన వయస్సులో పెళ్లికాక అనేక మంది పెళ్లికానీ ప్రసాదుల మాదిరిగానే మిగిలిపోతున్నారు. ఈ దోషాలుంటే జీవితంలో ఎలాంటి గ్రోత్ ఉండదు.
కొందరిలో పుట్టుకతో రాహుకేతు దోషాలుంటాయి. దీంతో పెళ్లి కుదరడం చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. పెళ్లికి అనేక రకాల అడ్డంకులు ఏర్పడుతునే ఉంటాయి. ఎంతగా ప్రయత్నించిన కూడా పనులు అస్సలు జరుగవు..
ఇలాంటి వారు ప్రతి మంగళవారం జంట నాగుల ఆలయానికి వెళ్లాలి. అంతేకాకుండా పాముల మీద పాలను పోయాలి. పురోహితులతో కాలసర్పదోష పూజలు చేయించాలి. నాగ ప్రతిష్ట, శాంతులు జరిపించుకోవాలి..
నాగ బంధం ఉంగరం వేసుకుంటే వెంటనే పెళ్లిసెటిల్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ ఉంగరం మధ్య వేలు లేదా ఉంగరం వేలుకు పెట్టుకొవాలి. బంగారం, వెండి, రాగితో ఈ ఉంగరాలు లభిస్తాయి.
మొదట జ్యోతిష్యుడిని సంప్రదించి మనకు ఏ లోహంతో సెట్ అవుతుందో అలాంటి ఉంగం కొనాలి. దాన్ని ఇంటికి తీసుకొచ్చి పాలలో ఒకరోజంతా పెట్టాలి. మరో రోజు దేవుడి దగ్గర పెట్టి, రాత్రి పూట దిండు కింద పెట్టుకొవాలి..
దిండు కింద పెట్టుకున్నప్పుడు ఎలాంటి చెడు కలలు పడకుండా, మంచి స్వప్నాలే పడితే మీకు ఇది బాగా పనిచేస్తుందని అంటారు. ఒక వేళ చెడు స్వప్నాలు కనక పడితే ఆ ఉంగరం మీకు మంచి ఫలితాలు ఇవ్వదని జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)