AP Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని  పేర్కొంది. 

1 /5

AP Rains: అల్ప పీడనం ప్రభావంతో  నేడు (ఆదివారం) అక్కడక్కడా తేలికపాటి వానలకు అవకాశం ఉందని.. సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయ. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

2 /5

వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటుగా ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 7న ఒకటి ఏర్పడగా.. అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది.. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటుగా ఏపీలో భారీగా వర్షాల పడ్డాయి.

3 /5

దీంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.  మరోవైపు 17న అండమాన్‌ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని మరో అంచనా ఉంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు తిరుమల వర్షాల కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

4 /5

మరోవైపు APలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 12  డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి.  

5 /5

శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం  జిల్లాల్లో కూడా చలి తీవ్రత కనిపిస్తోంది. చలి, పొగమంచు దెబ్బకు ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కమ్మేస్తోంది. మరీ దారుణంగా సాయంత్రం మూడు, నాలుగు గంటల నుంచి చలి ప్రభావం కనిపిస్తోందంటున్నారు.