Nayanatara: లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తన భర్త , పిల్లలతో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త చాలా వైరల్ గా మారాయి.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టిన నయనతార తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు అద్భుతమైన నటనతో వరుస విజయాలతో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది నయనతార.
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలకు పైగానే అవుతున్నా, ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ ల క్రేజ్ తో పోటీ పడుతూ పారితోషకం విషయంలోనే కాదు సక్సెస్ అందుకోవడంలో కూడా తన తర్వాతే ఎవరైనా అని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అందుకున్న నయనతార వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మొదట్లో శింబుతో ప్రేమాయణం నడిపిన ఈమె అతడితో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కొరియోగ్రాఫర్ , ప్రముఖ నటుడు అయినా ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకుంది. అంతేకాదు పెళ్లి వరకు కూడా వెళ్లాలనుకున్నారు. కానీ ప్రభుదేవా మొదటి భార్య కోర్టులో కేసు వేయడం, పైగా ప్రభుదేవా టార్చర్ భరించలేక నయనతార అతడి నుంచి బ్రేకప్ చెప్పుకుంది.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా ఉంటూ కెరియర్ ను ఇండస్ట్రీకే పరిమితం చేసిన ఈమె ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి ఇటీవలే వివాహం చేసుకోగా, సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు. వివాహమనంతరం అటు సినిమాను , ఇటు ఫ్యామిలీని చక్కగా లీడ్ చేస్తోంది నయనతార. ప్రస్తుతం ఉత్తమ గృహిణిల ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తోంది హ్యాపీ మార్నింగ్ అంటూ తాజాగా నయనతార షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా తన భర్త విగ్నేష్ తో మార్నింగ్ వాక్ చేస్తూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ముచ్చటైన జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఈ ఎప్పటికీ ఇంతే ఆనందంగా ఉండాలి మేడం అంటూ కోరుకుంటున్నారు . ఇక తన భర్త పిల్లలతో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లిన నయనతార కుటుంబం చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో చిల్ అవుతోంది నయనతార.