Nita Ambani Stylist About Hair Care: జుట్టు రాలిపోవడం.. ప్రస్తుతం తరం వారికి చాలా పెద్ద సమస్య. అందుకే ప్రస్తుత యువతరం జుట్టు రాలకుండా ఉన్నదానికి.. నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో.. నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్.. జుట్టు రాలేదని గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, దుమ్ము, ధూళి,వాతావరణం లో మార్పులు జుట్టుకు సరైన పోషణ అందివ్వకపోవడం లాంటి కారణాలు ప్రధానం. అయితే జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ప్రధానంగా కొన్ని అంశాలు ఉంటాయి అంటూ నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్.. అమిత్ ఠాకూర్ తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
అమిత ఠాకూర్ మాట్లాడుతూ.. తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు అధికంగా రాలుతుంది. తడిగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతుంది. ఫలితంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనూ .. రాత్రిపూట తలస్నానం చేయడం లేదా నిద్రపోయే ముందు తలస్నానం చేయడం మానుకోవడం ఉత్తమం.
తడి జుట్టు పై ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించడం.. హెయిర్ స్ట్రైట్నర్ తడి జుట్టుపై ఉపయోగించడం వల్ల వేడికి జుట్టు బలహీనపడి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా జుట్టుని ఆరబెట్టుకోవడం ఉత్తమమైన లక్షణం అని అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్.
అంతేకాదు జుట్టు విరబోసుకొని నిద్రపోవడం వల్ల జుట్టు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టు ముడి వేసుకొని నిద్రపోవడం మంచిది. వీటితోపాటు మరెన్నో కారణాలు జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. తీవ్రమైన ఒత్తిడి కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
కంటి నిండా నిద్ర లేకపోయినా జుట్టు రాలిపోతుంది రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాగూర్ చెప్పిన ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది అని చెప్పవచ్చు.