Pitru paksham 2024: పితృ పక్షాల్లో పూర్వీకులను కలలో చూడటం మంచిదా..?.. కాదా..?.. పండితులు ఏమంటున్నారంటే..?

Pitru paksham puja upay: సాధారణంగా చనిపోయిన పూర్వీకులు  పితృ పక్షాల్లో భూమి మీదకు వస్తుంటారని చెబుతుంటారు. ఈ సారి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగనున్నాయి.
 

1 /6

పితృ పక్షాలను పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెలలో.. 18 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈసారి పితృ పక్షలను జరుపుకుంటాం. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులు భూమి మీదకు వస్తుంటారని చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో మనం చేసే శ్రాద్ధకర్మలు మొదలైనవి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.

2 /6

చాలా మంది జీవితంలో ఎంత కష్టపడిన కూడా  ఒక ఎదుగుదల అనేది ఉండదు. ఎన్ని పనులు చేసిన అస్సలు కలిసిరాదు. కొంత మందికి సమయానికి ఉద్యోగం రాదు. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జీవితంలో ఎంత డబ్బులు సంపాదించిన కూడా మిగలడం ఉండదు.

3 /6

ఫ్యామిలీలైఫ్ అంతా గొడవల మయంగా ఉంటుంది. దంపతుల మధ్యగొడవల వల్ల సంతాన సమస్యలు ఉంటాయి. తరచుగా అనారోగ్యం ఇబ్బందులు పెడుతుంటుంది. అయితే.. వీటన్నింటికి కూడా.. పితృ శాపం కారణమని చెబుతుంటారు.

4 /6

చాలా మంది తమ వాళ్లు చనిపోయిన తర్వాత అంతిమసంస్కారాలు సరిగ్గా నిర్వహించరు. అంతేకాకుండా... చివరి రోజులు శ్రాద్ధకర్మలు కూడా సరిగ్గా నిర్వహించరు. దీంతో వారికి ఉత్తమ లోకాలకు పోరు. ఆత్మలకు శాంతి ఉండదు. దీంతో అవి తమ వాళ్లను చూసి ఏడుస్తుంటాయంటారు. అందుకే చనిపోయిన వారికి ప్రతి ఏడాది చనిపోయిన తిథిలో లేదా పితృ పక్షాల్లో తప్పనిసరిగా శ్రాద్ధకర్మాది కార్యక్రమాలు నిర్వహించాలని చెబుతుంటారు.  

5 /6

కొంత మంది చనిపోయిన వారు తరచుగా కలలో వస్తుంటారు. చనిపోయినవారు ఆకలిగా  ఉందని, వారికి ఇష్టమైన పదార్థం తింటున్నట్లుగా కలలు వస్తుంటాయి. కొంతమందికి కలలో తమ పూర్వీకులు తిడుతున్నట్లు లేదా ఏడుస్తున్నట్లు కూడా కలలు పడతాయి. దీని వల్ల కూడా వారు ఏదో మనతో చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు భావించాలి.  

6 /6

ఇలాంటి వారంతా.. పితృ పక్షాల్లో పండితులను పిలిచి, శ్రాద్ధకర్మాది కార్యక్రమాలు జరిపించాలి. అంతేకాకుండా.. పవిత్ర గంగాజలాలు,నదుల దగ్గరకు వెళ్లి.. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేకంగా దానాలు చేయాలి. వారికి ఇష్టమైన పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే మన పూర్వీకుల ఆశీస్సులు అందుతాయని కూడా పండితులు చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x