PM Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతు పంట పెట్టుబడికి అందిస్తున్న సాకారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం చిన్నా సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6000 పొందుతున్నారు. అయితే, గూగుల్ వేదికగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు పడవా? అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటి వరకు 18 విడుతల నిధులు రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. వారు ఇప్పుడ 19వ విడుత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా కొంతమందికి సందేహం వచ్చింది.
పీఎం కిసాన్ డబ్బులు పెళ్లి కాని రైతులకు పడవా? అని. అయితే, భూమి వారి పేర ఉండి, పట్టా పొంది ఉంటే వారి ఖాతాల్లో డబ్బులు పడతాయి. 2019 ముందు పీఎం కిసాన్‌లో రిజిస్టర్ అయినవారికి ఈ పథకం వర్తిస్తుంది.
అంతకు ముందే పేరు మీద ఉన్న రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బుల క్రెడిట్ అవుతాయి. అయితే, కేవలం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే భార్యాభర్తల్లో ఒక్కరికే ఈ పథకం ద్వారా డబ్బులు క్రెడిట్ అవుతాయి.
పీఎం కిసాన్ 18వ విడుత డబ్బులు అక్టోబర్ 5న విడుదల చేశారు. తాజాగా 19 విడుత డబ్బులు ఫిబ్రవరి మొదటివారంలో పడతాయని తెలిపారు. అయితే, పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది రూ.6000 రైతులు తమ పెట్టుబడికి సాయం పొందుతున్నారు.
ఇక సాయం రూ.10 వేలకు పెంచుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా మూడుసార్లు రూ.2000 చొప్పున పీఎం కిసాన్ నిధులు కేంద్రం విడుదల చేస్తోంది. అంటే మొత్తం రూ.6000 ఏటా పొందుతున్నారు.