PM Kisan Update: పీఎం కిసాన్ యోజన 19వ విడుత ఇన్స్టాల్మెంట్ డబ్బుల కోసం రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.6000 రైతులు ఖాతాలో జమ అవుతుంది. మూడు విడతల్లో రూ.2000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అయితే, ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ది పొందాలంటే ముందుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
పీఎం కిసాన్ 19వ విడుత డబ్బులు మీ ఖాతాలో చేరాయా? కేవైసీ పూర్తి చేశారా? లబ్ధిదారుల బెనిఫిట్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీంతో ఈ పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రైతుల ఖాతాల్లో డబ్బు జామా అవుతుంది.
పిఎం కిసాన్ ద్వారా కొన్ని మిలియన్ల మంది రైతులు ఆర్థికంగా చేయూతను పొందుతున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులను విడుదల చేస్తారు. అయితే 19వ విడుత 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
అయితే దీనికి ముందుగానే మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలి. Pmkisan. Gov. In వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు దగ్గర్లో ఉన్న సిఎస్సి సెంటర్ కు వెళ్లి పిఎం కిసాన్ కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా వెబ్సైట్లో కూడా మీరు నేరుగా పిఎం కిసాన్ కు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
దీనికి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
2024 అక్టోబర్ 5వ తేదీ 18వ విడుత పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా జమ చేశారు. 20,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యాయి దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు.