Pooja Hegde: హాట్ ఫోటోషూట్స్‌తో పూజా హెగ్డే రచ్చ.. బుట్టబొమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Pooja Hegde Pics: పూజా హెగ్డే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్న మొన్నటి వరకు హాట్ నెంబర్ వన్ హీరోయిన్. అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్‌ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్‌గా ముద్రపడిపోయింది. ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేక హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.

1 /6

పూజా హెగ్డే విషయానికొస్తే.. తమిళ సినిమా 'మూంగముడి' మూవీతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

2 /6

 తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో పూజా హెగ్డే పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నడిచింది.

3 /6

ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. 

4 /6

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో ఈమె చేసిన హాట్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

5 /6

లాస్ట్ ఇయర్ 'రాధే శ్యామ్' మూవీతో పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా బీస్ట్, ఆచార్య, హిందీలో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్' వరుస ఫ్లాపులు ఈమె కెరీర్‌ను డైలామాలో పడేసేలా చేసింది.

6 /6

పూజా హెగ్డే..వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ముందుగా ఈ భామను తీసుకొని తొలిగించారు.  అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.