Pooja Hegde Photos: సంప్రదాయ దుస్తుల్లో ఎంత ముద్దుగున్నావే బుట్టబొమ్మ!

Pooja Hegde Photos: మోడల్​గా రాణించి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పుజా హెగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాల్లో నటిస్తూ పూజా హెగ్డే బిజీగా మారిపోయారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలను చేస్తుంటారు. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కొన్ని ఫొటోలను పూజా హెగ్డే షేర్ చేశారు. 
 

  • Feb 02, 2022, 18:42 PM IST

   

1 /5

పూజా హెగ్డే.. 1990 అక్టోబరు 13న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది. చదువులో ఎం.కాం పూర్తి చేసింది.  

2 /5

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే.. 2010లో జరిగిన మిస్​ యూనివర్స్​ పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2012లో 'ముగమూడి' అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.   

3 /5

2014లో 'ఒక లైలా కోసం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది వచ్చిన 'ముకుందా'తో మెప్పించింది. 2016లో విడుదల అయిన 'మొహంజదారో' అనే సినిమా.. పూజా హెగ్డేకు హిందీలో మొదటి చిత్రం.  

4 /5

ఆ తర్వాత 'రంగస్థలం'లో ఐటెంసాంగ్ సహా 'అరవింద సమేత వీర రాఘవ', 'మహర్షి', 'గద్దలకొండ గణేష్'​ లాంటి వరుస చిత్రాలతో హిట్లు కొట్టంది. ఇటీవలే 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' చిత్రంతో హిట్ దక్కించుకుంది. ప్రభాస్ తో పూజా హెగ్డే కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది.   

5 /5

బాలీవుడ్‌లో సల్మాన్‌ 'కబీ ఈద్‌ కబీ దివాలీ', రణ్‌వీర్‌తో 'సర్కస్‌' చిత్రాలు చేస్తుంది. కోలీవుడ్‌లో విజయ్‌ 'బీస్ట్‌'లో కథానాయికగా ఎంపికైంది.