Pooja Hegde: ఆ ఒక్క సినిమాపైనే పూజా హెగ్డే ఆశలు.. ఆ మూవీ ఫ్లాపైతే బుట్ట బొమ్మ ఖేల్ ఖతమేనా..?

Pooja Hegde:  పూజా హెగ్డే  నిన్న మొన్నటి వరకు  తెలుగులో నెంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు టాలీవుడ్ అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్‌ గా బుట్టబొమ్మనే  ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా  రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్‌ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.

1 /7

పూజా హెగ్డే విషయానికొస్తే.. స్వతహాగా కన్నడ భామ అయిన తమిళ చిత్రం 'మూంగముడి'తో  వెండితెకు పరిచయం అయింది.  ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

2 /7

టాలీవుడ్ లో  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది.

3 /7

హరీష్ శంకర్ డైరెక్షన్ లో  అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫేట్ మారింది. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన ఫస్ట్ ఛాయిస్ అయింది. దాదాపు యంగ్ టాలీవుడ్ స్టార్స్ సరసన నటించింది.

4 /7

ప్రభాస్‌తో చేసిన 'రాధే శ్యామ్' నుంచి బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బీస్ట్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులతో ఈమె స్టార్‌డమ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

5 /7

అటు హిందీలో చేసిన 'సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో చేసిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీల ఫ్లాపులతో అక్కడ స్టార్ డమ్ తగ్గింది.

6 /7

ప్రస్తుతం ఈమె షాహిద్ కపూర్ సరసన ‘దేవ’ సినిమాలో నటిస్తోంది. ఈ ఒక్క సినిమానే ఈ భామ చేతిలో ఉంది. ఈ మూవీ ఫ్లాపైతే ఈ అమ్మడికి కెరీర్ ఖతం అయినట్టే అని చెప్పాలి.

7 /7

ఇక రష్మిక, శ్రీలీల ఎంట్రీతో బడా హీరోలకు పూజా హెగ్డే ఆనడం లేదనే చెప్పాలి. ఏది ఏమైనా పూజా హెగ్డేకు అర్జంట్ గా ఓ హిట్ కావాలి. మరి దక్కుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది.