Pragya jaiwal:ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. తమిళ సినిమా 'విరాట్టు'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో పరిచయమైంది. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణతో చేసిన అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించింది. హీరోయిన్ కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆపై సినిమాల్లో లక్ పరీక్షించుకుంది.
నటిగా ప్రగ్యా జైస్వాల్‌కు తొలి సినిమా తమిళంలో విడులైన 'విరాట్టు'.. అటు హిందీలో టిటూ ఎంబీఏ సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఒరిగిందేమి లేదు.
ప్రగ్యాకు తెలుగులో ఫస్ట్ మూవీ 'మిర్చి లాంటి కుర్రాడు'.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' మూవీతో పాపులర్ అయింది.
కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది ప్రగ్యా జైస్వాల్. కానీ హిట్టు మాత్రం అందుకోలేకపోయింది.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఈ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకే వెళ్లింది. ప్రగ్యాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.
ప్రగ్యా జైస్వాల్.. తెలుగులో చివరగా మోహన్ బాబు హీరోగా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో పలకరించింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం 'ఖేల్ ఖేల్ మే' అనే సినిమాలో నటిస్తోంది.