Allu Arjun: పవన్ కళ్యాణ్ బాటలో స్నేహా రెడ్డి..!.. భర్త గండం గట్టేక్కేందుకు 41 రోజుల పాటు ఆ కఠోర దీక్ష..

Allu arjun wife Sneha Reddy: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.
 

1 /8

పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ పై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసుల్ని నమోదు చేశారు.  అదే విధంగా అల్లు అర్జున్ ను అనేక నాటకీయ పరిణమాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కానీ హైకోర్టులో అనూహ్యంగా సింగిల్ జడ్జీ బన్నీకి మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన రిలీజ్ అయ్యారు. 

2 /8

పోలీసులు మరల అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దుకు మరో పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.   

3 /8

ఇప్పటికే సంధ్య థియేటర్ ను ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని కూడా పోలీసులు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సతీమణి మాత్రం ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారంట. 

4 /8

గతంలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో.. ప్రాయిశ్చిత దీక్షను చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాన్ తిరుమలకు నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకున్నారు.

5 /8

ప్రస్తుతం స్నేహరెడ్డి సైతం.. పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తొంది. స్నేహరెడ్డి తరచుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో 41 రోజుల పాటు.. స్వామివారికి కేవలం పండ్లు తిని ఉపవాసం ఉండనున్నారంట.  

6 /8

ఒక వైపు ధనుర్మాసం నేపథ్యంలో.. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని రోజు చదవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత తిరుమలకు వెళ్లి శ్రీవారిని స్నేహరెడ్డి దర్శించుకుంటారని తెలుస్తొంది. 

7 /8

అరెస్ట్ సమయంలో.. బెయిల్ దొరికిన తర్వాత అల్లు అర్జున్ హగ్ చేసుకుని.. స్నేహారెడ్డి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం స్నేహారెడ్డి తన భర్త కోసం.. ఉపవాసాలు, ధనుర్మాస పారాయణం కూడా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారంట.   

8 /8

గతంలో ఏపీలో కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదు అయినప్పుడు కూడా.. స్నేహరెడ్డి తిరుమలకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మరల ఇప్పుడు స్నేహారెడ్డి ఈ ఏడుకొండల వాడిపైన భారం పెట్టి.. తన భర్తను గండం నుంచి గట్టేక్కించమని ప్రార్థిస్తున్నట్లు తెలుస్తొంది.