Pushpa 2 Success Reasons: పుష్ప 2 భారీ విజయం రికార్డు కలెక్షన్లకు 5 ప్రధాన కారణాలివే, సినిమా ఎందుకంత హిట్ అయిందో తెలుసా

సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంచనాలను దాటి భారీ విజయం నమోదు చేయడంతో పాటు బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు చేసింది. సినిమాలో ఒక్కొక్క సీన్‌కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది. సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలామంది నిర్మాతలకు వణుకు పుడుతోంది. పుష్ప 2 భారీ విజయానికి 5 కారణాలేంటో తెలుసుకుందాం.

Pushpa 2 Success Reasons: సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంచనాలను దాటి భారీ విజయం నమోదు చేయడంతో పాటు బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు చేసింది. సినిమాలో ఒక్కొక్క సీన్‌కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది. సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలామంది నిర్మాతలకు వణుకు పుడుతోంది. పుష్ప 2 భారీ విజయానికి 5 కారణాలేంటో తెలుసుకుందాం.

1 /5

సినిమా సక్సెస్‌కు మొదటి కారణం ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ఉంది. 3 గంటల 26 నిమిషాల నిడివి ఉన్నా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండటంతో ఎక్కడా బోర్ అన్పించదు. టికెట్‌కు పెట్టిన డబ్బులు ప్రేక్షకులకు వాపసు వచ్చేస్తున్నట్టే. కొన్ని సీన్లు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తుంటాయి. 

2 /5

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 క్రేజ్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో కూడా గట్టిగా ఉంది. 2021లో మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా భారీ రికార్డులు వశమయ్యాయి. అప్పట్నించి పుష్ప మేనియాను సినీ మేకర్లు కొనసాగిస్తూ వచ్చారు. ప్రజల్లో సినిమా పట్ల ఉన్న క్రేజ్ చూసి ప్రమోషన్ కార్యక్రమం భారీగా చేశారు.టైమింగ్ కూడా బాగుండటంతో పుష్ప 1 కంటే పుష్ప 2 భారీ విజయం సాధించింది.

3 /5

మూడో కారణం అల్లు అర్జున్ రష్మి,క మందన్నా మధ్య అద్భుతంగా సాగిన కెమిస్ట్రీ. నాలుగేళ్ల నుంచి ఇదే సినిమాపై రష్మికతోనే పనిచేస్తున్నందున ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ ఇద్దరి జోడీ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. ఈ ఇద్దరికి తోడు పోలీస్ అధికారిగా, పుష్పకు ప్రత్యర్ధిగా ఫహద్ ఫాజిల్ నటన మరింత అద్భుతం. 

4 /5

పుష్ప 2లో కొన్ని సీన్లు చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే. ముఖ్యంగా జాతర సీన్ సినిమాకు హైలైట్. జాతరలో అల్లు అర్జున్ పూనకం వహించినట్టుగా చేసిన డ్యాన్స్ అందర్నీ మంత్రముగ్దుల్ని చేస్తుంది. కొన్ని సీన్లు చిత్రీకరించిన తీరు చూస్తుంటే హ్యాట్సాఫ్ అనాల్సిందే

5 /5

ఐదవ కారణం సినిమా స్టోరీ లైన్. పుష్ప సీక్వెల్‌లో కధను నడిపించిన తీరు అద్భుతంగా సాగింది. పుష్ప-శ్రీవల్లి మధ్య బందాన్ని అద్భుతంగా చూపించారు. సినిమాలో యాక్షన్, రక్తపాతంతో పాటు ఎమోషన్, కుటుంబ బంధాలు కూడా గట్టిగా ఉన్నాయి.