Add Zee Business As A Preferred Source
App

Rakul Preet: ప్రభాస్ సినిమా నుండీ తీసేశారు.. అల్లు అర్జున్ ఇలా అన్నారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన రకుల్..!

Written ByVishnupriya
Published: Sep 12, 2024, 10:20 PM IST|Updated: Sep 12, 2024, 10:20 PM IST

Rakul Preet interview: రకుల్ ప్రీత్ సింగ్ కి టాలివుడ్ లో మాత్రమే కాక.. మిగతా భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుసగా స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్ ఈ మధ్య టాలివుడ్ లో కనపడడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రకుల్ టాలివుడ్ హీరోల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 

Rakul Preet Singh movies1/5

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ 2011లో కేరటం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కానీ.. 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదటి హిట్ అందుకుంది. తర్వాత బాలీవుడ్‌లో యారియాన్ (2014) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్పైడర్ (2017) సినిమాతో మాత్రం ఆమె కెరియర్ డౌన్ అయ్యింది. 

Rakul Preet Singh About Tollywood2/5

రకుల్ ప్రీత్ సింగ్

తెలుగులో స్టార్‌గా ఎదిగిన రకుల్, బాలీవుడ్‌లో కూడా దే దే ప్యార్ దే, మర్జావాన్, రన్‌ వే 34 వంటి హిందీ సినిమాలతో తన ప్రతిభను చాటుకుంది. అయితే 2011 లోనే ఆమెకి ప్రభాస్ తో. నటించే అవకాశం వచ్చిందట. రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

Rakul Preet Singh About Prabhas3/5

రకుల్ ప్రీత్ సింగ్

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కంటే ముందే ప్రభాస్ సినిమాలో కూడా అవకాశం వచ్చింది అని.. కానీ షూటింగ్ మొదలైన నాలుగు రోజులకు తనకి కనీసం ఏమీ చెప్పకుండా ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ను ఎంపిక చేశారని.. చెప్పుకొచ్చింది రకుల్. అప్పుడు కాస్త బాధగానే అనిపించింది కానీ.. తనది ఎప్పటికైనా తిరిగి వస్తుంది అనే నమ్మకంతో వదిలేసాను అంటోంది ఈ భామ.

Rakul Preet Singh About Allu Arjun4/5

రకుల్ ప్రీత్ సింగ్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ అల్లు అర్జున్ గురించి చెప్పింది. "సరైనోడు షూటింగ్ టైం లో అల్లు అర్జున్ తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అని నాతో అన్నారు. ఇప్పుడు ఆయన పుష్ప తో ఇంత సక్సెస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది ఈ భామ. 

Rakul Preet Upcoming Movies5/5

రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం రకుల్ జాకీ భగ్నాని అనే బాలీవుడ్ నటుడిని పెళ్లాడి అక్కడే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లోనే దే దే ప్యార్ దే 2, మేరి పత్నీ కా రీమేక్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. చాలా కాలం తర్వాత రకుల్ ఈ మధ్యనే సౌత్ లో ఇండియన్ 2 సినిమాలో కనిపించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమె కెరియర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. రకుల్ ఇండియన్ 3 సినిమాలో కూడా నటిస్తోంది.