Ram Charan top Movies: RRR సహా రామ్ చరణ్ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..

Ram Charan Top Movies: రామ్ చరణ్ విషయానికొస్తే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. మొత్తంగా రామ్ చరణ్‌ కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..

1 /8

RRR (రౌద్రం రణం రుధిరం) {Roudram Ranam Rudhiram} : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో సెపరేట్ ప్లేస్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ సినిమాతో రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

2 /8

రంగస్థలం (Rangasthalam): సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో నటుడిగా రామ్ చరణ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

3 /8

ధ్రువ (Dhruva): రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ధ్రువ'. ఈ సినిమా తమిళంలో హిట్టైన 'తనిఓరువన్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.  

4 /8

ఎవడు (Evadu): రామ్ చరణ్‌ హీరోగా అల్లు అర్జున్ మరో ముఖ్యపాత్రలో  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా 'ఎవడు'. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

5 /8

నాయక్ (Nayak): వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'నాయక్‌'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

6 /8

రచ్చ (Rachcha): సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ 'రచ్చ'. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

7 /8

మగధీర(Magadheera): రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్, శ్రీహరి మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా 'మగధీర'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

8 /8

చిరుత (Chirutha): పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ 'చిరుత'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.