Ram Recent Movies Total Box Office Collections:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

Ram Recent Movies Total Box Office Collections: రామ్ పోతినేని  మాస్ ఇమేజ్ తో  తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. అటు ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. రీసెంట్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  ఈ నేపథ్యంలో రామ్ పోతినేని యాక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్  విషయానికొస్తే..

1 /5

డబుల్ ఇస్మార్ట్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ టోటల్ గా రూ. 11.55 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బాక్సాఫీస్ దగ్గర  డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.

2 /5

స్కంధ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘స్కంధ’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 33.50 కోట్ల షేర్ రాబట్టి అబౌ యావరేజ్ గా నిలిచింది.

3 /5

ది వారియర్.. రామ్  కథానాయకుడి యాక్ట్ చేసిన చిత్రం ‘ది వారియర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 21.65 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్ గా నిలిచింది. 

4 /5

రెడ్.. రామ్ తొలిసారి  ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 19.86 కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది.  

5 /5

ఇస్మార్ట్ శంకర్.. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం అప్పట్లోనే రూ. 20.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ. 40.56 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.