Sai Pallavi controversy: సాయి పల్లవి తాజాగా.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఇక మీదట తనను ఎవరైన ఆ విషయంలో లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేస్తే వదిలేదిలేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన అమరన్ మూవీ వేళ కూడా సాయి పల్లవిని కొంత మంది ట్రోల్స్ చేసినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ గురించి చులకన చేసి మాట్లాడారని కూడా ఏకీపారేశారు. అలాంటి నటి మేజర్ ముకుంద్ వరదరాజన్ కు సతీమణిగా నటించడంఏంటని కూడా ఫైర్ అయినట్లు సమాచారం.
అయితే.. తాజాగా, సాయి పల్లవి రామాయణం మూవీ చేస్తున్నారు. నితేష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో రాముడి పాత్రలో.. రణ్ బీర్ సింగ్, సీత పాత్రలో సాయిపల్లవి చేస్తున్నారు. ఈ మూవీని బాలీవుడ్ నిర్మాతలతో కలిసి.. అల్లు అర్వింద్ రూపొందిస్తున్నారు.
దీనిలో సీత పాత్ర చేస్తున్న సాయి పల్లవి కంప్లీట్ వెజిటెరియన్ అయిపోయారని.. బైట హోటల్స్, రెస్టారెంట్ లలో అస్సలు ఏమి కూడా ముట్టుకొవట్లేదని కూడా అంటున్నారు. విదేశాలకు కూడా వెళ్లినప్పుడు.. తన వంటవాళ్లతో తనతోపాటు తీససుకెళ్తున్నారని కొంత మంది రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.
ఈ క్రమంలో సాయిపల్లవి తాజాగా, ఇన్ స్టాలో పొస్ట్ పెట్టి ఏకీపారేసినట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకు ఈ రూమర్స, ట్రోలింగ్ భరించానని.. ఇక మీదట భరించేదని లేదని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తొంది.
ఇక మీదట లేని పోనీ రూమర్స్ చేసే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ఎప్పుడు కూల్ గా ఉండే సాయిపల్లవి ఈ విధంగా పోస్ట్ పెట్టడం పట్ల ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయంశంగా మారిందంట. సాయి పల్లవి, చైతు మూవీ తండేల్ ఫిబ్రవరి 7న అభిమానుల ముందుకు రానుందని సమాచారం.