సాక్షి మాలిక్... మోడలింగ్ రంగంపై ఉన్న మక్కువతో కాలేజీ రోజుల నుంచే మోడలింగ్, ర్యాంప్ వాక్స్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సోను కే టిటు కి స్వీటీ అనే సినిమాలో బమ్ డిగి డిగి అనే పాటలో సాక్షి స్టెప్పులేసి ఆకట్టుకుంది. అలా లైమ్ లైట్లోకి వచ్చిన సాక్షి మాలిక్‌కి ఆ పాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌లో స్టార్‌ని చేసింది. ఎక్కడ పార్టీలు జరిగినా అక్కడ వినిపించే ఈ పాటను ఇప్పటికే 621 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
పలు బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మోడలింగ్ చేస్తోన్న సాక్షి మాలిక్‌కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన మోడల్ సాక్షి మాలిక్ అక్కడే స్కూలింగ్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ముంబైకి చేరుకుంది. అక్కడే మోడలింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.