Samantha: సమంత ఆ నిర్మాత దగ్గర అప్పు చేసిందా.. కారణం తెలిస్తే షాక్..!

Samantha Health: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె,  అతి తక్కువ సమయంలోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది. 

1 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న సమంత.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. కెరియర్ పరంగా ఎన్నో సక్సెస్ లు చూసిన ఈమె వ్యక్తిగతంగా అన్నే ఇబ్బందులు ఎదుర్కొంది అని చెప్పవచ్చు. ఇకపోతే సమంత నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. వివాహమైన నాలుగేళ్లు సంతోషంగా ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ సడన్గా విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. 

2 /5

కేవలం నాలుగు సంవత్సరాలకే బోర్ కొట్టిందా అంటూ అప్పట్లో చాలా మంది సమంతపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి తోడు మయోసైటీస్ వ్యాధి కూడా ఆమెను మరింత ఇబ్బంది పెట్టింది. అంతేకాదు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి విదేశాలకు కూడా వెళ్ళింది. పైగా ఒక ఏడాది ఇండస్ట్రీకి విరామం ఇచ్చింది కూడా. 

3 /5

ఇక ఇప్పుడు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ, అందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా సమంత అల్లుడు శీను సమయం నుంచే మయోసైటిస్ వ్యాధి ఎదుర్కొందని ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.   

4 /5

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. సమంత చాలా మంచి అమ్మాయి. అల్లుడు శీను షూటింగ్ సమయం నుంచే ఆమె మయోసైటీస్ వ్యాధితో బాధపడింది. ఇక సమస్యకు చికిత్స చేయించుకోవడం కోసం రూ.25 లక్షలు డబ్బు కావాలి. చాలామంది నిర్మాతలను సంప్రదించింది కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ నేను ఆమెకు ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా అల్లుడు శీను సినిమా షూటింగ్ అయిపోయే వరకు దాదాపు నాలుగు నెలల పాటు ఆమెను ఫైవ్ స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేసి ఆమెకు స్టే చేసే ఏర్పాట్లు చేసాము. 

5 /5

ఆమె నా నుండి సహాయం పొందింది..కాబట్టి ఇప్పటికీ ఆమె నన్ను మర్చిపోలేదు. మేము కూడా సమంతను మా ఇంటి అమ్మాయిలాగే భావిస్తాము అంటూ బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఇక అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన విషయం తెలిసిందే.