Samantha-Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత కూడా తండ్రిని కోల్పోయింది. తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణించిన విషయాన్ని ఆమె అధికారికంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, తాజాగా తన తండ్రి మరణించిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తెలుగు ఆంగ్లో ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు, నినెట్ ప్రభు దంపతులకు జన్మించారు సమంత.
ఇకపోతే జోసెఫ్ ప్రభు మరణం తర్వాత ఆయన తన కూతురు సమంత, అల్లుడు నాగచైతన్య విడిపోయినప్పుడు తాను ఎంత మానసిక క్షోభ అనుభవించారో పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.
గతంలో నాగచైతన్య , సమంత ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి , 2017 లో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే అనగా 2021లో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
ఆ సమయంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు, సమంత నాగచైతన్య పెళ్లికి సంబంధించిన.. ఫోటోలను షేర్ చేసి, ఈ షాకింగ్ విషయాన్ని ఎదుర్కోవడానికి నాకు ఎంతో సమయం పట్టింది అంటూ వెల్లడించారు. జోసెఫ్ ప్రభు సమంత, నాగచైతన్య వివాహానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
ఈ విషయాలు చాలా కాలం.. క్రితవి. “ఇందులో ఒక కథ ఉంది. కానీ అది నేను చెప్పలేను. కాబట్టి కొత్త కథను ప్రారంభించి, కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుదాం అనుకుంటున్నాను అంటూ తెలిపారు. అలాగే కూతురు, అల్లుడు ఫోటోలను షేర్ చేస్తూ.. వీరిద్దరూ విడిపోవడం నన్ను మరింత బాధకు గురిచేసింది. ముఖ్యంగా మీ అన్ని భావాలకి నా ధన్యవాదాలు. నేను ఈ భావోద్వేగాలను అధిగమించడానికి చాలా సమయం తీసుకున్నాను. ముఖ్యంగా ఇలాంటి విషాదం నుండీ తేరుకోవడం ఇంకా బాధగా ఉంది,” అంటూ ఆయన తెలిపారు.
ఇకపోతే కూతురి విడాకులు తండ్రిని మరింత దిగ్బ్రాంతికి గురిచేసాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా సమంత ఇప్పుడు తన తండ్రిని..కోల్పోయింది. ఇక సమంత తండ్రి గతంలో చేసిన పోస్ట్లు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.