Samantha: సెకండ్ హ్యాండ్.. యూజ్‌డ్ అన్నారు.. చైతు పెళ్లి వేళ కాక రేపుతున్న సమంతా కామెంట్స్..


Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.
 

1 /6

నాగచైతన్య, శోభితలకు డిసెంబర్ 4న పెళ్లి జరగనుంది. ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియోస్ లో అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తన పెళ్లి గురించి చైతు ఫుల్ హ్యపీగా ఉన్నట్లు తెలుస్తొంది.  శోభితతో కొత్త జీవితం ప్రారంభించడానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. 

2 /6

మొత్తానికి చైతు, శోభిత మాత్రం పెళ్లి గురించి ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తొంది. అతిథుల్ని ఎవర్ని పిలవాలి.. వెడ్డింగ్ అరెంజ్ మెంట్స్ లలో చాలా బిజీగా ఉన్నారంట. అతిథుల సంఖ్య తక్కువగా ఉన్న.. పెళ్లి వేడుక సంప్రదాయం జరిగేలా చూస్తున్నారంట.

3 /6

మరోవైపు సమంతా ఇటీవల తరచుగా వివాదస్పద అంశాలతో వార్తలలో ఉంటున్నట్లు తెలుస్తొంది. ఈ మధ్యనే తాను.. తన ఎక్స్ కు ఇచ్చిన కాస్లీ గిఫ్ట్ లు వెస్ట్ అయ్యాయని కూడా మాట్లాడి వార్తలలొ నిలిచారు. తన జీవితంలో మంచి టైమ్ వేస్ట్ చేసుకున్నానని అన్నారంట. దీనిపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.  

4 /6

ఈ క్రమంలో మళ్లీ సామ్.. ఒక ఇంటర్వ్కూలో తన డైవర్స్ గురించి మళ్లీ మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. తనకు డైవర్స్ తర్వాత.. కొంత మంది సెకండ్ హ్యాండ్, యూజ్ డ్ అంటూ కామెంట్లు చేశారని, ఇలాంటి ట్యాగ్ లు పట్ల చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాఖ్యలు బాధలో ఉన్నవారిని మరింత కన్నీళ్లు తెప్పిస్తాయని అన్నారు.  

5 /6

తను విడాకుల తర్వాత మయోసైటిస్ కు గురయ్యాయని, ఆ తర్వాత మళ్లీ చాలా మంది తనను కామెంట్లు చేశారని, ఎట్టకేలకు మళ్లీ కొంత మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వల్ల కోలుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను బాగా బిజీగా ఉన్నానని, సవాళ్లను ఎదుర్కొంటు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.  

6 /6

అదే విధంగా కొంత మంది.. తన పెళ్లి గౌనును రీమోడల్ చేయించినందుకు విమర్శించారని.. ఇది రీవెంజ్ అంటు ప్రచారం చేశారన్నారు. గౌను రీడైజన్ అనేది నా పర్సనల్ విషయమని..దీనిలో ఎవరిమీద ప్రతీకారం తీర్చుకొవాలని ఆలోచించి చేయలేదని సామ్ క్లారిటీ ఇచ్చారు. నా లైఫ్ లో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని ముందుకు వెళ్తున్నానని సామ్ అన్నారు.  తాను ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నానని సామ్ చెప్పుకొచ్చారు.