Samantha: సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు కథానాయికగా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు సమంతకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.
నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో హీరోయిన్గా అడుగుపెట్టింది సమంత. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సామ్ నటనను ఎవరు మరిచిపోలేదు. అపుడు మొదలైన సామ్ ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.
14 యేళ్ల కెరీర్లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది. అందులో 'శాకుంతలం' వంటి పౌరాణిక మూవీ కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది.
ఏమాయా చేసావే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు వంటి వరుస హిట్స్‌తో తొలి మూడు సినిమాలతోనే హాట్రిక్ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగ'లో ప్రేమికుడిని కోల్పోయిన యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికీ దారేది' మూవీలో శశిగా ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు.
ఇక అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సినిమాలో ప్రియ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా తర్వాత వారింటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.
అటు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఈమె జీవితంలో కీ రోల్ పోషించాయి. అటు విడాకుల తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తోంది.
అటు వెబ్ సిరీస్‌లో కూడా రాణిస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది. త్వరలో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతుంది.
ఆ మధ్య మయసిటీస్తో బాధపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. మళ్లీ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్.