SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే

SBI home loan: దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన  ఎస్బిఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ అఫీషియల్ ప్రకటన చేసింది. హోం లోన్ తీసుకునేవారికి జీరో ప్రాసెసింగ్ ఫీజుతో రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది. 

1 /6

SBI home loan offer : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. హోం లోన్ తీసుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో హోంలోన్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.   

2 /6

కోట్లాది మందికి సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఉంటుంది. అందుకోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. బ్యాంకుల ద్వారా హోం లోన్ తీసుకుని సొంతింటి కలను నిజం చేసుకుంటారు. అలాంటి వారికి కోసం ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. మాన్‌సూన్ ఆఫర్ కింద హోమ్ లోన్ రుణగ్రహీతలకు  జీరో ప్రాసెసింగ్ ఫీజుతో హోంలోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. 

3 /6

ఈ విషయాన్ని ఎస్బిఐ తన సోషల్ మీడియాలో ట్విట్టర్ పోస్ట్‌లో సమాచారాన్ని షేర్ చేసింది. ప్రాసెసింగ్ జీరో శాతంతో మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి అంటూ పోస్టులో పేర్కొంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతుంది.   

4 /6

మీరు హోం లోన్ తీసుకోవాలని ప్లాన్  చేసినట్లయితే ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా ఎస్బిఐ హోమ్ లోన్ మొత్తంలో 0.35శాతం ప్రాసెసింగ్ ఫీజుతోపాటు జీఎస్టీని కలిపి వసూలు చేస్తుంది. గృహ రుణంపై ప్రాసెసింగ్ రుసుము కనిష్టంగా రూ. 2,000/ప్లస్ GST, గరిష్టంగా రూ. 10,000/ప్లస్ GST ఉంటుంది.   

5 /6

ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీని తర్వాత ఈ ఆఫర్ గడువు ముగుస్తుందని పేర్కొంది.   

6 /6

బ్యాంకులు గృహ రుణాలపై ఒకేసారి  ఫీజు వసూలు చేస్తాయి. ఈ ఫీజును హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ఇది సాధారణంగా రుణ మొత్తం నుండి తీసివేయరు.  రుణగ్రహీత దానిని విడిగా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది లోన్ ప్రాసెసింగ్ ఖర్చులను కవర్ చేయడానికి రుణదాత లేదా బ్యాంక్ వసూలు చేసే రుసుము. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట సమయాల్లో గృహ రుణం కోసం ప్రాసెసింగ్ రుసుమును మాఫీ చేస్తాయి.