Sobitha Dhulipala: పరవశంలో తేలిపోతున్న అచ్చ తెలుగు అందం శోభితా ధూళిపాల..

Sobitha Dhulipala: శోభితా దూళిపాల  గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. పదహారాణాల అచ్చ తెలుగు అందం. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ శోభితా మాత్రం ముందుగా  రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో అలరించడంతో పాటు.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలుస్తోంది.

1 /6

శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగందం.. ముందుగా ఈమె తన మాతృభాష తెలుగులో  కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.  

2 /6

శోభితా కెరీర్.. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా  తన లక్ పరీక్షించుకుంటుంది శోభితా.

3 /6

31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. అందాల పోటీలో గెలిచిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో లక్ పరీక్షించుకుంది. 

4 /6

అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాల.

5 /6

కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వంటి  వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది.

6 /6

ప్రస్తుతం శోభితా... సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది.