Teacher Days 2024: సిల్వర్ స్క్రీన్ టీచర్స్ గా రఫ్పాడించిన తెలుగు హీరోలు..

Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.

1 /9

సార్.. ప్రస్తుతం సమాజంలో విద్య అనేది కార్పోరేట్ లెవల్ కి మారింది. ఈ నేపథ్యంలో విద్యను కార్పరేటికరణకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ సినిమా ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కించారు.

2 /9

మాస్టర్.. చిరంజీవి హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాలో ఉపాధ్యాయుడి పాత్రలో మెగాస్టార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

3 /9

సింహా.. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిన ‘సింహా’ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించారు. అంతకు ముందు ‘వంశోద్దారకుడు’ సినిమాలో పీటీ టీచర్ పాత్రలో నటించి మెప్పించారు.

4 /9

సుందరకాండ.. కే.రాఘవేంద్రావు దర్శకత్వంలో  విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రంలో టీచర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.

5 /9

ఓనమాలు.. రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో యాక్ట్ చేసిన చిత్రం ‘ఓనమాలు’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉపాధ్యాయులు గొప్పతనాన్ని చాటింది.

6 /9

బడిపంతులు.. ఎన్టీఆర్ హీరోగా టైటిల్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘బడి పంతులు’. ఆ తర్వాత విశ్వరూపం సినిమాలో కూడా ఉపాధ్యాయుడిగా తన నట విశ్వరూపం ప్రదర్శించారు.

7 /9

మిరపకాయ్.. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిరపకాయ్’. ఈ సినిమాలో రవితేజ.. లెక్చరర్ పాత్రలో నటించి మెప్పించాడు.

8 /9

గోల్కొండ హై స్కూల్.. సుమంత్ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోల్కొండ హై స్కూల్’. ఈ సినిమా మంచి ఉపాధ్యాయ  చిత్రంగా నిలిచిపోయింది.

9 /9

వీళ్లతో పాటు పలువరు హీరోలు వీలైనపుడల్లా.. ఉపాధ్యాయుల వేషాలతో అలరించారు. అందులో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.