Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.

1 /9

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇంద్ర‌ సినిమా 2002లో 22 క్రితం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

2 /9

  చిరంజీవి,  కే.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేషన్ తో తెరకెక్కిన చిత్రం ‘ఘరానా మొగుడు’.  న‌గ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

3 /9

విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గ్యాంగ్ లీడ‌ర్ మూవీ చిరు కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి కథానాయికగా నటించింది.

4 /9

  జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన  శ్రీ‌దేవి హీరోయిన్‌గా న‌టించింది.  ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

5 /9

మెగాస్టార్ చిరంజీవి, విజ‌య‌శాంతి హీరో, హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’.  ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో  తెరకెక్కింది. ఈ సినిమా  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

6 /9

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజ‌య‌శాంతి, రాధ  నాయికా, నాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘యముడికి మొగుడు’. ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

7 /9

  గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మాణంలో   ఏ.కోదండ‌రామిరెడ్డి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌సివాడి ప్రాణం’. ఈ చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

8 /9

ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ ఖైదీ. సంయుక్తా మూవీస్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన  ఈ మూవీ  హీరోగా చిరు కెరీర్‌ను ఛేంజ్ చేసిన మూవీగా రికార్డుల‌కు ఎక్కింది.

9 /9

మొత్తంగా చిరంజీవి త‌న కెరీర్‌లో దాదాపు 8 సినిమాలు ఇండ‌స్డ్రీ హిట్‌గా నిలిచాయి. ఈ రేంజ్‌లో త‌న త‌రంలో ఇన్ని ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న హీరో ఎవ‌రు లేరు.