ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ జైలు ఇదే..జైలు సెల్స్ చూస్తే..హోటల్ రూం కంటే అద్భుతంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు నోర్డిక్ దేశాల జైళ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లగ్జరీ హోటల్ లేదా లగ్జరీ ప్లాట్ రూమ్స్ లా ఉన్నాయని నెటిజన్లు కామెంటు చేస్తున్నారు.
సాధారణంగా జైలంటేనే వణికిపోతుంటాం. కానీ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. తమ ఇళ్లతో ఆ జైళ్లను పోల్చుకుంటున్నారు. కొంతమందైతే హోటల్ రూమ్స్ కంటే బాగున్నాయంటున్నారు. ఇంకొంతమందైతే వీటిపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత మంచి వాతావరణం లగ్జరీ రూమ్స్ కల్పిస్తే..కావాలని ఏదో ఒక నేరం చేసి ఇక్కడికి వస్తారని చెబుతున్నారు. నిజమే కదా..మరి.
స్వీడన్, అమెరికా దేశాల జైళ్ల ఫోటోలు కూడా షేర్ చేసిన యూజర్..ఓ ప్రశ్న వేశాడు అందరికీ. నేరస్థులకు పునరావాసం, నేరమయ జీవితం నుంచి దూరంగా ఉంచడమే మీ ఉద్దేశ్యమైతే..ఎలాంటి జైలు వాతావరణం అనువైనదని అడుగుతున్నాడు.
కొంతమందైతే ఇలాంటి జైళ్లను వ్యతిరేకించారు కూడా. ఇంతటి లగ్జరీ జైలు ఒకవేళ అన్నిచోట్లా ఉంటే..కావాలనే ఏదో ఒక నేరం చేసి వచ్చేందుకు ప్రయత్నిస్తారని కామెంట్ చేస్తున్నారు.
నార్డిక్ దేశాల జైళ్లన్నీ నెలకు 2.2 లక్షల అద్దె ఉండే అపార్ట్ మెంట్ లా కన్పిస్తాయని యూజర్ అంటున్నాడు. నిజంగానే అలాగే కన్పిస్తున్నాయి కదా ఇవి.
ఈ పోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలైతే వీటిని చూసి హోటల్ రూం కంటే బాగున్నాయంటున్నారు. తమ ఇళ్ల కంటే అందంగా ఉన్నాయంటున్నారు ఇంకొందరు.
నార్డిక్ దేశాల్లో నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్ ల్యాండ్ దేశాలు వస్తాయి.
జైలు సెల్ లో హోటల్ వంటి చాలా వసతులున్నాయి. జైలు సెల్ లో లగ్జరీ బెడ్ తో పాటు టేబుల్ కూడా ఉంది. అటు కామన్ ఏరియాలో అయితే టెలివిజన్, టేబుల్ , సోఫాలున్నాయి.
@IDoTheThinking ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఈ ఫోటోలు షేర్ చేశారు. ఇవి నార్డిక్ దేశాల జైళ్లంటూ యూజర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.