Dress Designs: డ్రెస్ ఏదైనా.. లుక్ రిచ్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి..!

Dress Design Tips: ఇటీవల కాలంలో చాలామంది తక్కువ ఖర్చుతో ఎక్కువ రిచ్ గా.. ఉండేలా కనిపించాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు తీసుకురావడం జరిగింది.  ఈ చిట్కాలు పాటించడం వల్ల మీరు ఎలా ఉన్నా సరే మీ లుక్ రిచ్ గా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

1 /5

సాధారణంగా  అమ్మాయిలు అయినా,  అబ్బాయిలైనా ఏదైనా డ్రెస్ వేశారు అంటే, ఆ డ్రెస్ వల్ల అందం రెట్టింపు అవ్వాలని కోరుకుంటారు. మరి కొంతమంది రిచ్ లుక్ రావాలని ఆశిస్తారు. ఎవరు ఏ రకంగా.. ఆలోచించినా సరే తాము వేసుకున్న డ్రస్ తక్కువ ధర అయినా సరే ఎక్కువ ధర లా కనిపించాలని రిచ్ గా కనిపించాలని కోరుకుంటారు. మరి అలాంటి వారి కోసం ఇప్పుడు చిన్న చిట్కాలు తీసుకురావడం జరిగింది. 

2 /5

ముఖ్యంగా మనం రిచ్ గా కనిపించడానికి ఎంచుకునే కలర్స్.. కూడా మనకు సహాయం చేస్తాయి. చాలామంది ఎరుపు, పసుపు రంగులు మాత్రమే ధరిస్తారు. కానీ వాటి ప్లేస్ లో క్రీం,  నలుపు, తెలుపు, గోధుమ రంగు, బూడిద రంగు లాంటి కలర్స్ ఎంచుకుంటే మీ లుక్ రిచ్ గా కనిపిస్తుంది. అంతేకాదు ఈ కలర్స్ క్లాసిక్ లుక్ ఇస్తాయి అనడంలో సందేహం లేదు. 

3 /5

ఇక మీరు ఎంచుకునే డ్రెస్ ఏదైనా సరే మీ శరీరానికి అనుగుణంగా ఉండేలా..చూసుకోవాలి. చాలాసార్లు చాలా సన్నగా ఉన్నవారు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల లుక్  మొత్తం పోతుంది. దీని కారణంగా మీరు ఎంత ఖరీదైన డ్రస్ వేసుకున్నా సరే.. అంద విహీనంగానే కనిపిస్తారు. మరొకవైపు వదులుగా ఉండే లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల లుక్  కూడా చెడిపోతుంది. అందుకే డ్రెస్ ఎంచుకునే సమయంలో అది మీ శరీరానికి ఫిట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. 

4 /5

అంతేకాదు ఎంచుకునే డ్రెస్ కి తగ్గట్టు యాక్ససరీస్ కూడా ఎంచుకోవాలి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా డ్రెస్ కి సూట్ అయ్యే యాక్ససరీస్ తప్పనిసరిగా ఎంచుకోవడం ముఖ్యం. మీరు ఎంచుకున్న యాక్ససరీస్ మీ రూపాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతాయి. క్లాసిక్ వాచ్ లేదా వెండి చెవి పోగులు  మీ రూపాన్ని క్లాసిక్ గా కనిపించేలా చేస్తాయి. ఎప్పుడైనా సరే హెవీగా ఉండే వాటికి దూరంగా ఉండండి. 

5 /5

ఇక మీ లుక్ ను పరిపూర్ణం చేయాలంటే పాదరక్షలు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మీ ఎత్తు తక్కువగా ఉంటే కొద్దిగా మడమ ఉండే చెప్పులు ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా ఇలాంటి పాదరక్షలు మీకు మరింత అందాన్ని కూడా తీసుకువస్తాయి. అంతేకాదు మీరు ఎప్పుడు కూడా స్టైలిష్ స్పీకర్లను ఉపయోగించాలి  అంతేకాదు ఇవి మీకు సౌకర్యంగా ఉన్నాయా లేదో కూడా ఎంచుకోవాలి. ఇలా చేస్తే మీ లుక్ రిచ్ గా ఉండడమే కాదు మీరు కూడా కంఫర్ట్ గా ఉంటారు.