Tirumala: జనవరి 5వ తేదీ నుంచి వారికి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు.. ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం కోసం నిత్యం కొన్ని వేల మంది భక్తలు బారులుతీరుతుంటారు. అందుకే ప్రతినెల దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. టైట్‌ స్లాట్‌ టిక్కెట్లు, నడకదారిలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే జనవరి 5వ తేదీ నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అక్కడి స్థానికుల కోసం ప్రత్యేక దర్శనం కోటా టోకెన్లను 2025 జనవరి 5వ తేదీ నుంచి జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి లోకల్స్‌ కోసం ఇవి అందుబాటులో ఉంచనున్నారు. వారు ఈ టోకెన్లతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.  

2 /5

తిరుమల దేవస్థానం బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి దగ్గరలో ఉంటే స్థానికులకు ఈ టోకెన్ల ద్వారా స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ప్రతినెలా మొదటి మంగళవారం ఈ విధానం అందుబాటులో ఉండనుంది.  

3 /5

ఆదివారం 5వ తేదీ తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఈ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను మంజూరు చేయనున్నారు. తిరుపతి అర్బన్‌ స్థానికులు, తిరుపతి రూరల్స్‌, చంద్రగరి, రేణిగుంట మండలానికి చెందిన వారు ఈ టిక్కెట్లకు అర్హులు.  

4 /5

కానీ, వారి ఆధార్‌ కార్డు ఒరిజినల్‌ తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. స్థానికులుగా అప్పుడే గుర్తిస్తారు. పైన చెప్పిన ప్రదేశాల్లోని స్థానిక అడ్రస్‌ ఆధారంగా మాత్రమే వారికి ఈ ప్రత్యేక దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.  

5 /5

ఇదిలా ఉండగా జనవరి 10వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు పదిరోజులపాటు నిర్వహించనున్నారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ పదిరోజులు భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి  ఉంటుంది. వీరికి  ఉత్తరద్వార దర్శన భాగ్యం కలుగుతుంది.