Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Today gold and silver rates: బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. తొలిసారిగా బంగారం ధర 76 వేల రూపాయలను దాటింది. నేటి తాజాధరులను గమనిస్తే… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,160 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,810 రూపాయలుగా నమోదైంది.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయ నెలకొన్నటువంటి పరిస్థితులు అసలు కారణంగా చెబుతున్నారు. పసిడి ధర తొలిసారిగా 76 వేల రూపాయలు దాటింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు దాదాపు 200 రూపాయలు పెరిగింది. బంగారం ధర గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోంది. యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల ప్రభావం బంగారంపై తీవ్రంగా కనిపించే అవకాశం ఉందని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా బంగారం ధర అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్స్ కు గానూ 2650 డాలర్లుగా ఉంది. ఇక్కడ నుంచి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. రెండు ఇలాగే కొనసాగినట్లయితే అది త్వరలోనే బంగారం ధర 80000 దాటడం ఖాయమని తెలుస్తోంది.
ఇక దేశీయంగా చూసినట్లయితే బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టించడంతో పసిడి ప్రియులు ఆభరణాల దుకాణాలకు వెళ్లాలన్నా కూడా భయపడుతున్నారు. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.
రాబోయే ఫెస్టివల్ సీజన్ దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ సమయానికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం తులం ధర 1 లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తుండటంతో చాలామంది తమ ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకోవాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బంగారంలో తరుగు వంటివి తొలగిపోయే అవకాశం ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టి లాభాలు పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఒక చక్కటి పరిష్కారం గా చెప్పవచ్చు.
ఈ స్కీం లో మీరు డబ్బులు పెద్ద మొత్తంలో దాచుకోవచ్చు. అంతేకాదు ఈ స్కీం లో డబ్బు పెట్టిన వారికి బంగారంతో సమానంగా డిజిటల్ గోల్డ్ కేటాయిస్తారు. బంగారం విలువలతో పాటు ఈ బాండ్ల విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు బంగారంపై లాభం పొందడానికి ఇది సరైన మార్గంగా చెప్పవచ్చు.