UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. మీ పేరు ఇలా చెక్‌ చేసుకోండి..

UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్స్ ఆఫీసర్స్‌ పోస్టులకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. 
 

1 /6

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు వచ్చే నెల నవంబర్ జరగనున్నాయి. ఈ అభ్యర్థులకు గతంలో రాత పరీక్ష నిర్వహించారు. పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్‌ చేశారు.  

2 /6

యూపీఎస్‌సీ ఈపీఎఫ్ఓ ఇంటర్వ్యూ నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 6 వరకు నిర్వహించనున్నారు. ఈ మౌఖిక పరీక్ష ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.   

3 /6

ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు న్యూ ఢిల్లీలోని ధోలాపూర్‌లో ఉన్న షాజహాన్‌ రోడ్‌లో ఉన్న యూపీఎస్‌సీ ఆఫీసు వద్ద నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల పేరు, రోల్‌నంబర్, ఇంటర్వ్యూ తేదీలు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో అందుబాటులో ఉన్నాయి.  

4 /6

ఇంటర్వ్యూకు కావాల్సిన పత్రాలు.. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు ఈ కాపీలను కూడా తీసుకువెళ్లాలి.

5 /6

పది పాసైన మార్క్‌ షీట్‌, అందులో పుట్టిన తేదీ సరిగ్గా ఉండాలి. మీ ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌, ఎక్స్‌పీరియన్స్‌ క్వాలిఫికేషన్‌, మీ కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) పీహెచ్‌ సర్టిఫికేట్‌. ఎంప్లాయర్‌ నుంచి ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్

6 /6

మీ పేరు ఏదైనా మారితే దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ కూడా తీసుకువెళ్లండి. ప్రభుత్వ సర్వీస్‌ డిక్లారేషన్‌. యూపీఎస్‌సీ ఈపీఎఫ్‌ఓ 2024 రిక్రూట్మెంట్‌ ద్వారా 418 పోస్టులను భర్తీ చేయనుంది.