Us surgeon general on Cancer: యూఎస్ సర్జన్ ల నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా లిక్కర్ తాగే వారిలో ఏడు రకాల క్యాన్సర్ లు వచ్చేందుకు అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.
చాలా మంది యువత మద్యంకు బానిసయ్యారని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు లిక్కర్ గొంతులో పడందే ఆరోజు నిద్రపోని మందుబాబులు చాలా మంది ఉంటారు. కొందరు పని ఒత్తిడి భరించలేక తాగేవాళ్లుంటే.. మరికొందరు ఏదో టైమ్ పాస్ కు.. డబ్బులు ఎక్కువై మద్యం సేవించే వారు మరికొందరు.
ఇక కొందరైతే.. మద్యానికి బానిసగా మారుతుంటారు. అసలు.. వారికి లిక్కర్ దొరక్కపోతే.. జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్స్ లో ఉంటారు. మద్యం దొరక్కపోతే..వింతగా ప్రవర్తిస్తుంటారు.
మద్యం తాగే అలవాటు ఉన్న వారికి మాత్రం పిడుగు లాంటి వార్తగా చెప్పుకొవచ్చు. తాజాగా .. అమెరికా సర్జన్ జనరల్ నివేదికలో మద్యం తాగే అలవాట్లు ఉన్నవారికి ఏడురకాల క్యాన్సర్లు వస్తాయని కూడా నివేదిక వెల్లడించింది.
మద్యపానం వల్ల రొమ్ము, (పెద్ద పేగు), అన్నవాహిక, నోటి, గొంతు,కాలేయం వంటి క్యాన్సర్ ముప్పు ఉంటుందని డాక్టర్ లు తమ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తొంది. సిగరేట్ ల వల్ల 19 శాతం క్యాన్సర్ కేసులు, ఒబేసీటీతో..7.8 శాతం క్యాన్సర్ కేసులు, 6.5 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది.
ఈ రెండింటి తర్వాతి స్థానంలో మద్యపానం ఉందని, 5.6 క్యాన్సర్ కేసులకు, 4 శాతం క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమని నివేదిక వెల్లడించింది. అదే విధంగా మద్యపానం వల్ల మహిళలకు చాలా డెంజర్ అని కూడా నివేదిక తెలిపిందిు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 17 శాతం వాటికి మద్యపానం కారణం కావొచ్చని తెలిపింది.
కొందరు తాము ఏదో వారానికి ఒకసారి లేదా ఏదైన పార్టీలో తాగుతామని అనుకుంటారని.. ఇలాంటి వారిలో కూడా కాలం గడిచే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గిపోయాక.. క్యాన్సర్ సింప్టమ్స్ బైటపడుతాయని కూడా నివేదిక వెల్లడించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ నివేదిక మాత్రం మందుబాబులకు కిక్ పొగొట్టే వార్తగా చెప్పుకొవచ్చు.