Bottle Gourd for White Hair Problem: తెల్లజుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లకు వెళ్లడం లేదా మార్కెట్లో విపరీతంగా లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, అవి ఎక్కువగా కెమికల్స్ కలిగి ఉంటాయి. కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో కూడా తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేయవచ్చు.
సాధారణంగా తెల్లజుట్టు సమస్యకు ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగపడుతాయి. దీనివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అంతేకాదు జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోదు. అ
సొరకాయ అంటే మనం చక్కగా పులుసు, సాంబార్‌లో వేసుకుంటాం. అయితే, ఈ సొరకాయతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంటే నమ్ముతారా? ఓ ప్రత్యేక నూనెను దీంతో తయారు చేసుకోవచ్చు.
సొరకాయను పై తొక్కతో కోసి, ముక్కలుగా కట్ చేసి మంచి ఎండలో దాదాపు 5 రోజుల పాటు ఆరబెట్టాలి. ఆ తర్వాత ఇనుప పాత్రను తీసుకుని అందులో కొబ్బరి నూనెను వేసి వేడి చేయండి.
ఆ తర్వాత ఈ నూనెలో ఎండు సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా మరిగించాలి. ఓ 20 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పైనుంచి తీసి పక్కనబెట్టుకోవాలి. ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోండి..
ఈ నూనెను రోజూ రాత్రి పడుకునే ముందు మీ తలకు పట్టించి ఉదయం మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా చేస్తుంటే తెల్ల జుట్టు కొద్ది రోజుల్లో నల్లగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)