Cold Wave: వామ్మో చలి.. గజ గజ వణుకుతున్న ప్రజలు..

Cold Waves: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చలికి ప్రజలు గజ గజ వణికిస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి అక్కడ ప్రజలను ఒణికిస్తోంది. మధ్యాహ్నం వరకు పొగమంచు కమ్ముకొని ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు.
 

 

1 /6

Cold Waves: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి చంపేస్తోంది. ఏజెన్సీ తరహా కొండ ప్రాంతాల్లో చలి సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఎంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. మరోవైపు చలి తీవ్రతతో ఉదయం స్కూల్లకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2 /6

మరోవైపు మార్నింగ్ వాక్ చేసే వాళ్లకు పొగమంచుతో సమీపంలో ఉన్న వాళ్లు కనబడటం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

3 /6

ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని బేలాలో అతి తక్కువగా 6.3 డిగ్రీలు నమోదు అయింది. మరోవైపు హైదరాబాద్ మహా నగరాన్ని చలికి వణికిస్తోంది. ఉదయం 12 గంటలకు వరకు చలి తగ్గడం లేదు.

4 /6

దీంతో చలికి ప్రజలు చిగురుటాకుల్లో ఒణికిస్తున్నారు.  హైదరాబాద్ లో చెట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7.1 డిగ్రీలు నమోదు అయింది. అటు ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాకా, మల్లాపూర్, సైనిక్ పూరి వంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

5 /6

ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది.తెలంగాణ  రాష్ట్రంలో వచ్చే 2  రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. లైట్లు వేసి బండ్లు నడపాలని సూచిస్తారు. .

6 /6

మరోవైపు మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  2 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం వుంది. మరోవైపు  రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది. రాగల 2 వారాల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయి.