Nagapanchami 2024: శివుడు తన మెడలో కంఠాభరణంగా ధరించే పాము పేరు ఏంటో తెలుసా..?..

Lord shiva: శివుడిని ఎప్పుడు చూసిన ఆయన మెడలో ఒక సర్పం కన్పిస్తు ఉంటుంది. చాలా మంది శివుడి మెడలో ఉన్న పామును,సర్పాల జాతీకి రాజుగా భావిస్తారు. 

1 /5

బ్రహ్మ, విష్ణువు, శివుడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. సృష్టి,స్థితి, లయకారకులుగా వీరిని చెప్పుకుంటారు. చాలా మంది శివుడ్ని భోళా శంకరుడిగాను కోలుచుకుంటారు. శివయ్య మీద చెంబు నిండా నీళ్లు పోసి, బిల్వపత్రం సమర్పిస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడు.

2 /5

శివుడు స్మశానంలో ఉంటూ,పులిచర్మం కప్పుకుని, మెడలో పామును ఆభరణంగా వేసుకుంటాడు. ఒంటి నిండా విభూతిని ధరిస్తాడు. చాలా మంది శివుడి మెడలో ఉన్న సర్పంపేరేంటని తెలుసుకొవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

3 /5

శివుడి అవతారం లీల ఎంతో గొప్పదని చెప్పుకొవచ్చు. ఆయన పులిచర్మం, తలపై గంగమ్మ, చంద్రుడు, ఒంటి నిండా భస్మం, మెడలో పామును ఆభరణంగా ధరిస్తాడు. పూర్వం సముద్ర మథనం అప్పుడు విషం బైటకువస్తుంది. 

4 /5

అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి.. సృష్టి కాపాడతాడంట. అప్పుడు ఆయన తాగిన విషయం కడుపులోకి పోకుండా.. మెడ దగ్గర ఉండేలా.. విష్ణుమూర్తి ఒక సర్పాన్ని ఆయనకు కంఠాభరణంగా ఉండేలా వరమిస్తాడంట.అప్పటి నుంచి వాసుకీ సర్పం శివుడి మెడలో ఉంటుంది.   

5 /5

 అంతేకాకుండా.. సర్పాలకు కూడా వాసుకీ సర్పమే రాజని కూడా చెప్తుంటారు. ఈ సారి ఆగస్టు 9 నాగ పంచమి వస్తుంది. ఈ రోజున అందరు పుట్టల దగ్గరకు వెళ్లి సర్పాలకు, సర్ప ప్రతిమలకు పాలతో అభిషేకం చేస్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)